Successful producer Dill Raju will be making a new film next year with energetic star Ram. Trinadha Rao Nakkina who made a blockbuster film Nenu Local this year will direct the new film under Sri Venkateswara Creations Banner.

దిల్ రాజు కాంపౌండ్ ఈమధ్య కొత్త కొత్త కాంబినేషన్లని సెట్ చేస్తోంది. అందులో భాగంగా రామ్ - త్రినాథరావు నక్కిన కాంబోలో ఓ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యే ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన వెలువడింది. అయితే ఈ సినిమాకోసం దర్శకుడు త్రినాథరావు తనకి అచ్చొచ్చిన ఫార్ములాని ఎంచుకొన్నాడని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.
త్రినాథరావు ఇదివరకు "సినిమా చూపిస్త మామా" - "నేను లోకల్" సినిమాల్ని తీశాడు. ఆ రెండు సినిమాలకీ మామాఅల్లుళ్ల మధ్య డ్రామానే హైలెట్. ఆ రెండూ కూడా మంచి హిట్లయ్యాయి. అందుకే ఇప్పుడు రామ్ తో తీస్తున్న సినిమా కథకీ మామా అల్లుళ్ల టచ్ ఇస్తున్నారని తెలుస్తోంది.
రామ్ ఎనర్జీకి, త్రినాథరావు నక్కిన టేకింగ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేకింగ్ వాల్యూస్ తోడు కావడం సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రం లో చాలా కీలకమైన పాత్ర ఒకటి పోషిస్తున్నారు.
ఒక ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రం లో నటిస్తారు. ఈ చిత్రానికి కధ ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నారు. మామా అల్లుళ్ల మధ్య వార్ అనేది ఎప్పుడూ మాస్‌ని అలరించే అంశమే. మరి రామ్ అల్లుడి పాత్రలో ఎలా సందడి చేస్తాడో చూడాలి.